విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కృష్ణానది, బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లో వ్యర్ధాలను వేయొద్దని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, IAS అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ, 2022 అక్టోబర్ 2 నుండి “మిషన్ క్లీన్ కృష్ణా-గోదావరి” కార్యక్రమాన్ని కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది, ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అక్టోబర్ 31 వరకు ప్రతి రోజు కుడా జరిగే కార్యక్రమాలలో స్ట్రీట్ వెండార్స్ అన్ని షాపుల మరియు హోటల్ సంబందిత వ్యక్తులు మరియు ప్రజలు పాల్గొని కెనాల్ బండ్ సుందరీకరణ లో పాల్గొని జల కాలుష్యాన్ని తగ్గించి ప్రజల యొక్క జీవితాలకు హాని తగ్గించే విధంగా చెయ్యాలని కోరారు. నగర ప్రజలు నిత్యం వ్యర్థాలను కాలువలలో వేయుట వలన దిగువ ప్రాంత ప్రజలు వ్యవసాయ, తాగునీటి అవసరాలకు వినియోగించే నీరు కలుషితమవుతుందని అన్నారు. కాల్వల్లో పూల వ్యర్థాలు, ప్లాస్టిక్, లిక్విడ్, నివాస మరియు వాణిజ్య వ్యర్థాలను కాలువలో వేయడం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి కాలువ ప్రక్కన నివసించే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలోని కాలువలను పరిశుభ్రంగా మార్చేందుకు మరియు దిగువ ప్రాంతాలలో నివసించే అనేక మంది ప్రజల జీవితాలను రక్షించడానికి, విజయవాడ నగర ప్రజలందరూ ఈ మిషన్లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని అన్నారు. కమిషనర్, మరియు మున్సిపల్ సిబ్బంది, ప్రజలతో కలిసి అలంకార సెంటర్ నుండి డీ మార్ట్ వరకు ర్యాలీ నిర్వహించి కాలువల ప్రక్కన ఉన్నటువంటి చెత్త వ్యర్థాలను క్లీన్ చేసి ఆ చెత్త మొత్తాన్ని డేస్ట్ బీన్స్ లో వేయడం జరిగినది.
Prajavartha Online Telugu News