విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ 1996 డిఎస్సి క్వాలిఫై టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ ధర్నా చౌక్ సెంటర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో క్వాలిఫై టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గూడేల గోపాలరావు మాట్లాడుతూ మేము 1996 డీఎస్సీ క్వాలిఫై అయ్యామని కానీ మేము నిరుద్యోగులుగానే ఉన్నామని వాపోయారు. పరిష్కరించ బడని క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కరింపబడింది. 96, 98 డిఎస్సి అభ్యర్థుల విషయంలో లోకల్, నాన్ లోకల్ ఎంతో అన్యాయం జరిగింది. నవరత్నాల రథసారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించి మా జీవితాల్లో వెలుగులు నింపుతారని ఎంతో ఆశగా ఉన్నామని అన్నారు. మాకు జీవితం జీవన్మరణ సమస్య అయిందని మాకు భవిష్యత్తు కల్పించి మా కుటుంబాలని ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాం అని అన్నారు. కోవిడ్ కారణంగా మాలో కొంతమంది మరణించారని కొంతమంది చిరు ఉద్యోగులుగా ఆర్థిక బాధలు అనుభవిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి మా మొర ఆలకించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్వాలిఫై టీచర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News