Breaking News

నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలతో పేదల బ్రతుకుల్లో పెనుమార్పులు వచ్చి వారి ఇంట వెలుగులు నిండాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ ప్రాంతాల్లో పర్యటించిన అవినాష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు వారి హర్షం వ్యక్తం చేస్తూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు.విజయవాడ నగరంలోనే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్దది అయిన ఈ డివిజన్ లో నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ  హయం తరువాత మరలా ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా అవుతున్నాయని ఇక్కడి పెద్దలు చెబుతున్నారు అని అన్నారు.ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి కి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి నూతన మెట్లు మార్గాలు,సైడ్ డ్రైనేజీ ,మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఒక పక్క రాష్ట్రంలో సంక్షేమ పథకాల వెలుగులుతో జగనన్న జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అని విమర్శించారు. గద్దె రామ్మోహన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎందుకు నియోజకవర్గ అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని ప్రశ్నించారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నారని,వారి సంపూర్ణ మద్దతు ప్రభుత్వనికే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు పమిడిముక్కల రాజు, విజయబాబు, యాసీన్, డేవిడ్ రాజు,బిమిశెట్టి నాని,గణేష్ బాబు తదితరులు పాలొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *