విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అటవీశాఖ, విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం సాయంత్రం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను గుణదల అమ్మ ఓల్డేజ్ హోమ్ నందు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి ఆశ్రమానికి వెళ్లిన అవినాష్ వారి మధ్యలో కేక్ కట్ చేసి పెద్దిరెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News