Breaking News

ఆడపిల్లను ప్రోత్సహించి అన్ని రంగాలలో ముందుండేలా కృషి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటికి దీపం సృష్టికి మూలమైన ఆడపిల్లను ప్రోత్సహించి అన్ని రంగాలలో ముందుండేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
అంతార్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో బాలికలకు స్వీట్లు అందజేసి నూతన వస్త్రాలను బహుకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పురుషులకు సమానంగా అన్నిరంగాలలో స్త్రీలు రాణిస్తున్న తరుణంలో బాలికల ప్రాధాన్యత ఎంతో పెరిగిందన్నారు. ఆడపిల్ల పై గతంలో ఉన్న చులకన భావన నుండి తల్లిదండ్రులు ఆడపిల్లే కావాలనే పరిస్థితులను నేడు చూస్తున్నామన్నారు. ప్రభుత్వం బాలిక సంరక్షణ కొరకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా శిశు సంక్షేమ ద్వారా బాల్య దశనుండే బాలికల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్దపెటడంతో పాటు కౌమార దశ నిండే వరకు అవసరమైన పౌష్టికాహరాన్ని అందించడం జరుగుతుందన్నారు. బాలికపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను నివారించి వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. బాలికలు ఎదుర్కొంటున్న లింగవివక్ష అసమానతలపై అవగాహన కల్పించడమే బాలిక దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. బాలికలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అందుపుచ్చుకుని వారికి ఇష్టమైన రంగంలో రాణించాలన్నారు. ఎప్పుడైన.. ఎక్కడైనా.. ఎవరైనా బాలికలు అపదకు గురి అయినట్లు గుర్త్తిస్తే రక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్‌ లైన్‌ 1098 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181 సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఈసందర్భంగా రోజ్‌బడ్స్‌ స్కూల్‌ విద్యార్థిని డి. అస్మిత, బిఎస్‌ఆర్‌కె పాఠశాల విద్యార్థిని ఇ సౌమ్య, బిషప్‌ అజరయ్య పాఠశాల విద్యార్థులు యం కృప, యం కావ్యలకు జిల్లా కలెక్టర్‌ నూతన వస్త్రాలను అందజేసి బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలల సంరక్షణపై రూపొందించిన మన సమయం వచ్చింది మన హక్కులు సాదిద్దాం భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అనే పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విడుదల చేశారు.
కార్యక్రమంలో నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్‌మోహన్‌రావు, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, సిడిపివోలు జి. మంగమ్మ, నాగమణి, చిల్డ్రన్స్‌ హోం పర్యవేక్షకురాలు డి. జోత్స్న, జిల్లా చైల్డ్‌ ప్రొటక్షన్‌ ఆఫీసర్‌ జి. రమ, అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ షెక్‌ రహేనా, ఫోరంఫర్‌ చైల్డ్‌ రెట్స్‌ కో`ఆర్డినేటర్‌ అవర రమేష్‌, బడ్స్‌ స్వచ్చంద సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *