Breaking News

ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం ద్వారా గడపవద్దకే వైద్యం…

-పేద ప్రజలకు కూడా ఇకపై ఫ్యామిలీ డాక్టర్‌…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం అమలు పై మంగళవారం కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రజా ప్రతినిధులు వైద్య అధికారులు వివిధ శాఖల అధికారులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు సంపన్నవర్గాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు. పేద ప్రజలకు కూడా అంటువంటి సేవలను అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానానికి శ్రీకారం చుట్టి త్వరలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దివంగత నేత డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 108,104 అంబులెన్స్‌ విధానాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం అందించడం ద్వారా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నడవలేని స్థితిలో వైద్య సేవల కొరకు ఆసుపత్రులకు చేరుకోలేని వారికి నేరుగా గడప వద్దకే వైద్య సేవలను అందించడమే ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం లక్ష్యమన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. వారిలో ఒకరు ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులకు వైద్యం అందిస్తారని, మరొకరు గ్రామీణ స్థాయిలో పర్యటిస్తూ డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని 239 వైస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్‌ సేవలు అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం ద్వారా వైద్యులు సిబ్బంది 104 వాహనం ద్వారా గ్రామాలలో పర్యటించి రోగులకు వైద్య సేవలు అందిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం. 4 గంటల వరకు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి నెల రోజులకు సరిపడ మందులను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. తీవ్ర సాధారణ ఆరోగ్య సమస్యలు, గర్భిణిస్త్రీలు, బాలింతలు ఆరోగ్య పరీక్షలు, నవజాత శిశువులకు కౌమార బాలికలకు ఆరోగ్య పరిరక్షణ సేవలు, గర్భనిరోధక మరియు పునరుత్పత్తి, క్షయ, హెచ్‌ఐవి, కామెర్లు వంటి అంటువ్యాధుల నివారణ, మధుమేహాం, రక్తపోటు, కంటి చెవి ముక్కు గొంతు నోటి పరిక్షలు నిర్వహించడం, వృద్దులకు ఆరోగ్య పరిరక్షణ, మానసిక డి అడిక్షన్‌, పోషకాహార కౌన్సెలింగ్‌ సేవలు అందించనున్నారన్నారు. సాయంత్రం 4 గంటల అనంతరం గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య శ్రీ ద్వారా అందుకున్న సేవల వివరాలపై రోగుల నుండి అభిప్రాయాలను సేకరించి నివేధికలను పొందుపరుస్తారని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యదిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవసరమైన వైద్యులను సిబ్బందిని నియామకాలను పూర్తి చేసి ఇప్పటికే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా మెరుగైన వైద్య సహాయాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం ద్వారా రోగుల వద్దకే వైద్య సేవలను తీసుకువెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను సఫలీకృతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిప్యూటి డియంహెచ్‌వో డా. నళినిదేవి, కమ్యూనిటి హెల్త్‌ ఆఫీసర్‌ డా. నారాయణ, పిహెచ్‌సి వైద్యులు డా. నరసింహనాయక్‌, డా. కళ్యాణి, ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్‌ డా. సుమన్‌, డిఇవో సివి రేణుక, డిపివో జె. సునీత, ఐసిడిఎస్‌ పిడి జి.ఉమాదేవి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఏ. వెంకటేశ్వరావు, జిల్లాకు చెందిన జడ్పిటిసిలు, యంపిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *