Breaking News

భారతదేశపు మొట్టమొదటి అల్యూమినియం సరకు రవాణా రైలు – 61 BOBRNALHSM1

-భారతదేశపు మొట్టమొదటి అల్యూమినియం సరకు రేక్ – 61 BOBRNALHSM1ని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ప్రారంభించిన కేంద్ర రైల్వేల శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్
-దేశీయంగా – రైల్వేలు, బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్ మరియు హిందాల్కో సంయుక్తంగా అభివృద్ధి చేసిన రైలు
-సాంప్రదాయ సరకు రవాణా రైళ్ల కంటే అల్యూమినియం రేక్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశపు మొట్టమొదటి అల్యూమినియం సరకు రవాణా రైలు – 61 BOBRNALHSM1ని ఈరోజు అనగా తేదీ 16 అక్టోబర్ 2022 న కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ఈ రేక్ యొక్క గమ్యం బిలాస్పూర్.
ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా దేశీయంగా RDSO, HINDALCO మరియు బెస్కో వ్యాగన్ల సహకారంతో రూపొందించబడింది.

అల్యూమినియం రేక్ యొక్క లక్షణాలు:
-సూపర్స్ట్రక్చర్పై వెల్డింగ్ లేకుండా పూర్తిగా లాక్బోల్టెడ్ నిర్మాణం.
-టారే సాధారణ స్టీల్ రేక్ల కంటే 3.25 టన్నులు తక్కువగా ఉంటుంది, ఒక్కో వ్యాగన్ 180 టన్నుల సామర్థ్యంతో అదనపు సామర్థ్యంకల్గి ఉంటుంది . పేలోడ్ నుండి టారే నిష్పత్తి 2.85.
-ఒక రేక్ దాని జీవితకాలంలో 14,500 టన్నుల CO2ని ఆదా చేస్తుంది. సరకు రవాణాలో తిరుగు ప్రయాణములో ఇంధనం ఎంతో తక్కువ వినియోగం మరియు లోడ్ చేయబడిన స్థితిలో ఎక్కువ సరుకు రవాణా చేయడం వలన కార్బన్ పాదముద్రను తగ్గిస్తుంది.
రేకుల పునఃవిక్రయం విలువ 80%
ఈ సూపర్ స్ట్రక్చర్ అంతా అల్యూమినియం తో నిర్మిచబడినందున సరకు రవాణా ధర 35% ఎక్కువ ఉంటుంది .అలాగే అధిక తుప్పు మరియు రాపిడి నిరోధకత కారణంగా నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుంది ఇనుము పరిశ్రమ దిగుమతి నుండి వచ్చే నికెల్ మరియు కాడ్మియంను చాలా వినియోగిస్తుంది. కాబట్టి, అల్యూమినియం వ్యాగన్ల విస్తరణ తక్కువ దిగుమతికి దారి తీస్తుంది. అదే సమయంలో, ఇది స్థానిక అల్యూమినియం పరిశ్రమకు ఒక ఊతంగా నిలవనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *