Breaking News

ప్రజారోగ్యానికి ప్రధమ ప్రాధాన్యత


-రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-స్వర హాస్పిటల్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
-రూ. 10 వేలు ఖర్చయ్యే పరీక్షలు, మందులు ఉచితం
-అడ్మిషన్, రక్తపరీక్షలపై 20%, ఎండోస్కోపీపై 50% రాయితీ
-ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యం
-స్వర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణను ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుని, వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులోని స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రధమ వార్షికోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ సందర్భంగా హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. స్వర హాస్పిటల్ ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన అనంతరం, ఉచిత వైద్య శిబిరాన్ని మల్లాది విష్ణు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అందిపుచ్చుకుని, సేవా దృక్పథంతో వైద్య చికిత్సలందిస్తున్న స్వర హాస్పిటల్ నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేయడం హర్షణీయమని విష్ణు కొనియాడారు. ఈ సందర్భంగా స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. అవినాష్ మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు. తమ హాస్పిటల్ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ శిబిరం ద్వారా రూ. 10 వేల వరకు ఖర్చయ్యే వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డయాబెటిస్ చెకప్, జనరల్ చెకప్ లతో పాటు కిడ్నీ, ఆర్థో, పల్మానాలజీ, డెంటల్ విభాగాలకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించడమే కాకుండా, అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. క్యాంపు ద్వారా వచ్చే పేషేంట్లకు అడ్మిషన్, రక్తపరీక్షల్లో 20 శాతం, ఎండోస్కోపీ ఛార్జీల్లో 50 శాతం రాయితీ అందిస్తామని ప్రకటించారు. తమ హాస్పిటల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ, స్థాపించిన తొలి ఏడాది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని చూరగొన్నామని డాక్టర్ అవినాష్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు పునరంకితమవుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వర హాస్పిటల్ సీఈవో వెంకట్, చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అన్వేష్, పలువురు వైద్య నిపుణులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వర హాస్పిటల్ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా రోగులకు, వయోవృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *