Breaking News

గిరిజన ప్రభుత్వ వైద్యులతో ఆత్మీయ సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు అధ్యక్షతన ఆదివారం వివిధ విభాగాల్లో పనిచేయుచున్న గిరిజన ప్రభుత్వ వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన తొలి ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 40,000వేల మంది గిరిజన ఉద్యోగులు, 32లక్షల మంది గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా, ప్రభుత్వ యంత్రాంగంలో సమన్వయంలేకపోవటం వలన ఆశించిన స్థాయిలో గిరిజనాభివృద్ధి జరగలేదంటూ గిరిజనులే గిరిజనాభివృద్ధికి సామాజిక చైతన్యం కలిగించి, విద్య, వైద్యం, సంక్షేమం, ఉపాధి రంగాల అభివృద్ధికి విద్యాధికులు అయిన వైద్యులు తమవంతు సామాజిక పాత్ర పోషించి గిరిజనులకు సామాజిక న్యాయం చేయాలని కోరారు. వైద్యులు గిరిజనుల ఆరోగ్యం కోసం తమవంతు కృషి చేయాలని కోరుతూ, ఆరోగ్యం ఉంటేనే విద్య, సంక్షేమం, ఉపాధి అవకాశాలు సక్రమంగా ఉపయోగించుకోగలరని అన్నారు. ఈ సమావేశంలో హాజరయిన వైద్యులతో పరిచయ కార్యక్రమం & వైద్యుల వివిధ రకాల సమస్యలు తెలుసుకోవటం జరిగింది. శాఖా పరమైన సమస్యల పరిష్కారం కోసం కమిషన్ నిరంతరం సహాయపడుతుందని, వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు ఎప్పుడైనా కమిషన్ ను సంప్రదించవచ్చన్నారు. వెనుకబడిన గిరిజన సమాజాన్ని మేలు కొల్పాల్సిన అవసరం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తొలగిపోయేలా చేయవలసిన బాధ్యత విద్యావంతులైన గిరిజనులందరిపై ఉందన్నారు. అనేక సంఘాలు అనేక గ్రూపులుగా ఉన్న గిరిజనులు ఏకమై ఒక్కటిగా గిరిజన గళం వినిపించటమే గిరిజనాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

ముఖ్య అతిథిగా హాజరయిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర వైద్యులు వెలిబుచ్చిన వివిధ శాఖా పరమయిన సమస్యలు, పదోన్నతుల సందేహాలపై వివరణ ఇచ్చారు. అనేక మంది వైద్యులు వారి వారి రంగాలలో నిష్ణాతులే కానీ, పదోన్నతులు వంటి శాఖా పరమైన విషయాలపై కూడా అవగాహన కలిపించుకొంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ట్రైబల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు మూలవేతనం పై అదనంగా యిస్తున్న మూలవేతనం ప్రభుత్వం పెంచిందని వివరాలు తెలియజేసారు. మాతృశాఖ ఉద్యోగులు అయిన వైద్యులతో సమావేశానికి రావటం ఆనందం కలిగించచిందన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, కొర్రా రామలక్ష్మి, ఎస్టీ కమిషన్ సెక్రటరీ సతీష్, డాక్టర్ బాలునాయక్ & వివిధ జిల్లాల నుండి వచ్చిన గిరిజన వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *