-క్రీడా మంత్రి అర్.కే. రోజా
– రూ. 50 లక్షల బహుమతులు
-నాలుగు క్రీడల్లో పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గల ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కాన్ఫరెన్స్ హాలులో జగన్నన్న క్రీడా సంబరాల లోగోని రాష్ట్ర పర్యాటక, యువజనాభ్యుదయ, సాంస్కృతిక, క్రీడల శాఖా మంత్రి ఆర్.కె. రోజా గురువారం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… జగనన్న క్రీడా సంబరాల కింద క్రీడా కారులను ప్రోత్సహించే దిశగా, గ్రామ స్థాయి మరియు వార్డ్ స్థాయి దిశగా స్పోర్ట్స్ క్లబ్స్ నిర్వహించమని ఇంతకముందే చెప్పటం జరిగిందన్నారు .ఏ క్రీడలో ఎక్కువ క్లబ్స్ ఫార్మ్ అయ్యయో వాటిలో నాలుగు క్రీడలను (కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్) గుర్తించి రూ . 50 లక్షల ప్రైజ్ మనీ తో పోటీలు నిర్వహించాలని నిర్ణయించి నట్లు చెప్పారు .ఇక భవిష్యత్తులో నూ ఏ క్రీడాకి ఎక్కువ క్లబ్స్ ఫార్మ్ అవుతాయో వాటికి కూడా ఇలాగె ఎప్పటికప్పటికి పోటీలు నిర్వహించి పారితోషకం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మొదటగా కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. నియోజక వర్గ స్థాయిలో ఎమ్మెల్యే లు , రాజకీయ నాయకులను కూడా భాగస్వామ్యులను చేస్తూ వారి యొక్క నియోజకవర్గం స్థాయిలో క్రీడాకారులని గుర్తించి తరువాత జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించబడతాయన్నారు. జిల్లా స్థాయిలో గెలిచిన వారికి జోనల్ లెవల్ నిర్వహిస్తారు. ఫైనల్ గా డిసెంబర్ 20 , 21 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీల్లో పాల్గొని గెలిచిన విజేతలకు రూ. 50 లక్షల విలువ జేసే బహుమతులను అందించనున్నారని మంత్రి పేర్కొన్నారు. అలాగే జగన్నన్న క్రీడా సంబరాలలో క్రీడాకారులందరు పాల్గొని, ఆనందించండి, విజేతలుగా నిలవండని తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీమతి డా. జి. వాణిమోహన్ ఐ.ఏ.యస్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మానేజింగ్ డైరెక్టర్ డా. యన్. ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News