Breaking News

వై. ఎస్. ఆర్. నేతన్న నేస్తం పధకం ద్వారా చేనేత వృత్తి ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలకి ఏడాదికి 24 వేల ఆర్ధిక సహాయం

-50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులను వృద్దాప్యం లో ఆదుకుంటున్నాం.
-జిల్లాలో 1250 మంది చేనేత కార్మికులకు రూ.2500 చొప్పున పెన్షన్ పథకం
-జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వై. ఎస్. ఆర్. నేతన్న నేస్తం పధకం ద్వారా చేనేత వృత్తి పై ఆధార పడే చేనేత కార్మికుల ప్రతీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందింస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత పేర్కొన్నారు. గురువారం చేనేత మరియు జాళి శాఖ, వారి ఆధ్వర్యంలో జిల్లా చేనేత మరియు జౌళి శా ఖ ఆధ్వర్యం లో స్థానిక ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండపం, జాంపేటలో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకములను కలెక్టర్ మాధవీలత, రూడా ఛైర్పర్సన్ షర్మిలా రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, అక్టోబర్ 20 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఈ వస్త్ర ప్రదర్శన, అమ్మకం జరుగుతుందనీ, వస్త్ర ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోసుకుని చేనేత వస్త్రాలు కొనుగోలు చెయ్యలన్నారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రం లోని, దేశంలో ప్రఖ్యాతి గాంచిన వివిధ జిల్లాలకు చేనేత మరియు పట్టు” వస్త్రాలతోపాటు కాటన్, మెర్సి డైజేడ్ టై & డై చీరలు, సికో చీరలు, మాధవరం, వెంకటగిరి, జరీ చీరలు, మంగళగిరి డ్రస్ మెటీరియల్స్, ఉప్పాడ జమ ధాని చీరలు, షర్టింగ్స్, కలంకారి వస్త్రాలు, పొందూరు ఖద్దరు, పెద్దాపురం సిల్క్ షర్టింగ్స్ మరియు ప్రఖ్యాతి గాంచిన బెడ్ షీట్స్, ఇంకా మరెన్నో పేరెన్నికగన్న ఆకర్షణీయమైన వస్త్ర ఉత్పత్తులు అందుబాటు లో ఉన్నాయన్నారు.

వై. ఎస్. ఆర్. నేతన్న నేస్తం పధకం ద్వారా 2022 – 2023 సంవత్సరము లో జిల్లాలోని 883 మంది చేనేత కార్మికు లను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 24 వేల రూపా యలు చొప్పున రూ.2.12 కోట్ల ఆర్థిక ప్రయోజనం వారి బ్యాంక్ ఖాతా ల్లో కి జమ చేయ డం జరిగిందన్నారు. ముద్ర ఋణాలు ద్వారా జిల్లా లో ఇంతవరకు 649 మంది లబ్ధిదారులకు రూ. 3.25 కోట్లు లబ్ధి పొందడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనను విజయవంత ముగా నిర్వహించుటకు చేనేత మరియు జాళి శాఖ ప్రణాళికా బద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయ డం జరిగిందన్నారు. ఈ ప్రదర్శ నకు రాష్ట్రం నలు మూలల నుంచి మరియు తెలంగాణా రాష్ట్రం నుండి దాదా పు 25 చేనేత స హకార సంఘ ముల ఉత్పత్తి దారులు పాల్గొని మన దేశ సంస్కృతికి అద్దం పడుతున్నాయని రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం, జిల్లాలోని వివిధ ప్రాంతములలో ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగప ర్చుకొని చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, చేనేత వస్త్రా లను ధరించి నేత కార్మికులకు చేయుత నివ్వవలసినదిగా కోరారు.

ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా చేనేత మరియు జాళి శాఖ అధికారి, కె. పెద్దిరాజు, ఆర్. డి. డి. జిల్లా చేనేత మరియు జాళి శాఖ, బి. ధనుంజయ, డవలప్ మెంట్ అధికారులు, డి. కృష్ణ భాస్కర్, వై. సుబ్రహ్మణ్యం, కె. గంగారాజ్, బి. టి. నాయుడు, ఎ. డి. ఓ లు, డి. రాంబాబు, బి. శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *