Breaking News

ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధం పై వీడియో కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఫ్లెక్సీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి నవంబర్ ఒకటి నుంచి ఫ్లెక్సీ బ్యానర్స్ వినియోగం పై ప్రభుత్వ ఉద్దేశ్యాలను వెల్లడించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ లతో ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సమావేశంలో కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని 57 మంది ఫ్లెక్సీ బ్యానర్స్ ప్రింటింగ్ చేసే కంపెనీ ప్రతినిధులు, యజమానులు, మెటీరియల్ సరఫరా దారులతో సమావేశం నిర్వహించా మన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి సానుకూలంగా స్పందించారని, ఐతే వారి వద్ద ఎక్కువ మొత్తంలో స్టాక్ ఉందని, ఇటీవలే వాటిని కొనుగోలు చేయడం, ప్రస్తుతం సీజన్ లో సరైన వ్యాపారం లేదని మరికొంత సమయం కోరడం జరిగిందని అన్నారు. 2022 నవంబరు ఒకటి నుంచి ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధం పై స్పష్టం మైన వైఖరీ ఉందని స్పష్టం చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లెక్సీ బ్యానర్స్ ప్లాస్టిక్ మెటీరియల్ ఖరీదు రూ. 8 (అడుగు) ధర ఉందని, క్లాత్ మెటీరియల్ ఐతే రూ.32 వరకు అవుతుందని, ఇది ప్రజలకు భారం గా మారుతుందని పేర్కొన్నట్లు వివరించారు. ఎక్కువ మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారం చేస్తున్నారని, తగిన విధంగా ఆదుకోవాలని కోరుతున్నారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *