విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఆయర్వేద దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని డా. యన్. ఆర్. యస్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీ మరియు డా. ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వారిచే గురువారం జూబిలీ భవనం నందు ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డా. సాయి సుధాకర్, ప్రిన్సిపాల్ మరియు డా. పి. రాజరాజేశ్వరి ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ జ్యోతి ప్రజ్వలనం చేసి వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ రోగులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖవారి సూచనలు మేరకు , కమీషనర్,ఆయుష్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం, హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద, ప్రతి దినం ప్రతి ఇంట్లో ఆయుర్వేదం అనే నినాదంతో ఆయుర్వేధంపై అవగాహన, ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఆయుర్వేదం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి జీవన విధానంలో ఒక భాగమై వున్నదన్నారు. భారతీయ సాంప్రదాయ ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆచరించడం వలన అనేక వ్యాధులను రాకుండా అరికట్టవచ్చుననన్నారు. ఆసుపత్రి లో స్పెషలిస్టు వైద్యులచే కీళ్ళవాతం, గ్యాస్టిక్ సంబంధిత వ్యాధులు, పైల్స్, ఫిస్టులా, చర్మవ్యాధులు, నేత్ర, శిరో రోగ సంబంధిత వ్యాధులు, స్త్రీ ప్రసూతి సంబంధిత రోగాలకు, ఓ. పి. మరియు ఐ.పి. రోగులకు ప్రత్యేక సేవలు అందజేయడం జరుగుతున్నదన్నారు. ప్రజలు ఉదయం.8 గంటల నుండి రాత్రి 8గంటల వరకు ఓ. పి. రోగులు వైద్య పదుపాయాలను వినియోగించు కోవాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News