-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధేయవాది స్వాతంత్ర పోరాట సమరయోధుడు కీర్తిశేషులు కాకాని వెంటకరత్నం స్మారక విగ్రహాన్ని త్వరలో పున:ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. స్వర్గీయ కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ కాకని వెంకటరత్నం కుటుంబ సభ్యులు కాకాని తరుణ్, కాకాని విజయకుమార్, కోనేరు మధు తదితరులు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావును కలిసి విజ్ఞాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కీర్తిశేషులు కాకాని వెంకటరత్నం రాష్ట్రానికి జిల్లాకు ఎనలేని సేవలందించారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా గతంలో బెంజ్‌సర్కిల్ నందు ఆయన స్మారకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బెంజ్‌సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు సర్కిల్ విగ్రహాం అడ్డుగా ఉన్నాయని జాతీయ రహదారుల శాఖ వాటిని తొలగించడానికి పూనుకున్నారన్నారు. ఆ సమయంలో కాకాని కుటుంబ సభ్యులు, స్వాతంత్య్ర సమరయోధులు, రైతు సంఘాల న్యాయకులు, విగ్రహాన్ని తొలగించడంలో అభ్యతరం లేదని సమీపంలోని అడ్డుగాలేని ప్రాంతంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని ధర్నా చేయడం జరిగిందన్నారు. ధర్నా చేసిన వారిపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసిందన్నారు. కాకాని కుటుంబ సభ్యుల కోరిక మేరకు స్వాతంత్ర సమరయోధులు, రైతులు, జిల్లా ప్రజల మనోభావాల మేరకు తిరిగి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ డిల్లీరావు స్పందిస్తూ స్వాతంత్ర సమరంలో స్వర్గీయ కాకాని వెంకటరత్నం అలుపెరగని పోరాటం చేశారన్నారు. జిల్లా బోర్డు అధ్యక్షులుగా జిల్లా అభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. విద్య, ఆరోగ్యం నీటి పారుదల రంగాల అభివృద్ధి, గ్రామాలలో మౌలిక సదుపాయలను అభివృద్ధి చేసి కాకాని మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. ఆంధ్రా ఉక్కు మనిషిగా ప్రత్యేక ఆంధ్రా ఆందోళన మధ్య తుది శ్వాస విడిచిన కాకాని వెంకటరత్నం విగ్రహాం పున:ప్రతిష్ట చేసి ఆయనకు నివాళులు అర్పించాల్సిన భాధ్యత మనపై ఉందన్నారు. త్వరలో ఆయన విగ్రహాన్ని బెంజ్‌సర్కిల్ సమీపంలో పున:ప్రతిష్టచేసేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
Prajavartha Online Telugu News