Breaking News

ప్లాస్టిక్‌ నిషేదాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్స్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు స్పెషల్‌ చీప్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు వివరించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్స్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేద అమలు పై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇలతో స్పెషల్‌ చీప్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సచివాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ నవంబర్‌ 1వ తేది నుండి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్స్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా ఇప్పటికే అధికారులు, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్స్‌ తయారీ దారులతో సమావేశాలను నిర్వహించామన్నారు. జిల్లాలో 60 నుండి 70 కుటుంబాలు ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్స్‌ తయారీదారులు ఉన్నారని వారికి ప్రత్యమ్నాయంగా క్లాత్‌ బ్యానర్లు తయారీ చేసే విధంగాను, ఆర్టీస్టులను సమకూర్చడం, ప్రత్యమ్నాయ వ్యాపారాలకు సహకరించడం జరుగుతుందని తెలియజేశామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో నగరపాలక సంస్థ అడిషనల్‌కమీషనర్‌ సత్యవతి, ఏపి కాలుష్య నియంత్రణ మండలి ఇఇ ప్రసాద్‌రావు, డిపివో జె.సునీత, ఎస్‌ఎల్‌బిసి అధ్యక్షులు ఎస్‌ హెచ్‌ నవనీత్‌ కుమార్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *