Breaking News

ప‌క‌డ్బందీగా ఎపిపిఎస్‌సి ప‌రీక్ష‌లను నిర్వహించండి…

-డిఆర్ఓ కె. మోహన్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 21వ తేదీ శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న ఎపిపిఎస్‌సి ప‌రీక్ష‌ల‌ను ప‌క‌డ్భంధీగా నిర్వ‌హించాల‌ని, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. హార్టీక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ క‌మీష‌న‌ర్‌, దేవాదాయ‌శాఖ‌, ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌, ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌, సెరీ క‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌, అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్, టెక్నిక‌ల్ అసిస్టెంట్ త‌దిత‌ర పోస్టుల‌కు సంబంధించి, కంప్యూటర్ బేస్డ్ రిటన్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో డిఆర్ఓ మోహన్ కుమార్ గురువారం సాయంత్రం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పరీక్షకు 770 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షలను నగరంలోని కొత్తపేట పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జున రావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలోనూ, ఆటోనగర్ శ్రీ విజయ దుర్గ ఐటి ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్, గొల్లపూడి లోని శిరీష ఇన్ఫో టెక్నాలజీస్, గవర్నర్ పేట లోని ఎస్విటి ఇన్ఫోటెక్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండు షిఫ్ట్ లుగా జరిగే ఈ పరీక్షలు . ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌లు వ‌ర‌కు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు నలుగురు లైజనింగ్ అధికారులను, నలుగురు చీప్ సూపరిండెంట్లను నియమించామన్నారు. ప‌రీక్షా కేంద్రాల‌వ‌ద్ద ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశించారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష కావ‌డంతో, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విద్యుత్ స‌దుపాయానికి అంత‌రాయం క‌ల‌గ‌కుండా చూడాల‌న్నారు. మాల్ ప్రాక్టీస్ జ‌ర‌గ‌కుండా ప‌క్కాగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అభ్య‌ర్ధుల‌పై నిఘా ఉంచాల‌ని సూచించారు. త‌గిన పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేయాల‌ని కోరారు. ప‌రీక్ష పూర్తి అయ్యేవ‌ర‌కూ అభ్యర్థులను బ‌య‌ట‌కు పంపించ‌కూడ‌ద‌ని చెప్పారు. అధికారులంతా అప్ర‌మ‌త్తంగా ఉండి, స‌జావుగా ప‌రీక్ష పూర్తి అయ్యేలా చూడాల‌ని డిఆర్ఓ మోహన్ కుమార్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *