Breaking News

సత్యాగ్రహ దీక్షలను విరమించిన వాల్మీకులు…


-ఎస్టీలుగా వాల్మీకులు మూడు నెలల్లో నివేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ గత 19 రోజులుగా విజయవాడ, ధర్నాచౌక్‌ నందు వాల్మీకులు చేస్తున్న సత్యాగ్రహ దీక్షలను గురువారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ ఏక సభ్యుడిగా కమిషన్‌ ఏర్పాటుచేశారని, ఈ కమిషన్‌ మూడు నెలల్లోగా నివేదిక ఇస్తుందన్నారు. కమిషన్‌ నివేదిక, ఎస్టీ కమిషన్‌ నివేదికను వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌, తాను స్వయంగా ఢల్లీికి వెళ్లి ప్రధాని, హోంశాఖ మంత్రులను కలుస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ఈశ్వరయ్య మాట్లాడు తూ గత గత ప్రభుత్వ హయాంలోనూ కమిషన్‌ ఏర్పాటుచేసి దాని నివేదికను అసెంబ్లీలో ఏకగ్రీవం ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి తమ సమస్యను పరిష్కరించి మరలా మరోసారి సత్యగ్రహ దీక్ష చేయడానికి తమకు అవకాశం ఇవ్వవద్దని కోరారు. తమ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌కు వాల్మీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి గోరట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, గాంధీ సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌, వాల్మీకి జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మీనగా జగదీశ్వర్‌రావు, వాల్మీకి సంఘం నాయకులు చొప్పరపు భాను ప్రకాష్‌, వి.సుంకరత్నమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *