Breaking News

శాంతి, అహింసలతో మరో విజయం… : ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాంతి, అహింసలతో మరో విజయం… అని దీనికి నిదర్శనం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శుభపరిణామం అని గాంధీ సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ అన్నారు. గత 20 రోజులుగా విజయవాడ, ధర్నాచౌక్‌ నందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ శాంతియుతంగా, అహింసా మార్గంలో చేస్తున్న సత్యాగ్రహ దీక్షలకు రాష్ట్రం ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి వాల్మీకుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేయడం తనకు ఆనందంగా వుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తమ హక్కుల కోసం శాంతిభద్రతలకు భంగం కలగకుండా కృషి చేస్తే న్యాయం జరుగుతుందన్నారు. గాంధీ మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ అమలు చేయాలని పిలుపునిచ్చారు. అసత్యాలు మాని నోటుకి ఓటు మాని ప్రతిఒక్కరు స్వచ్ఛంద వైఖరితో రాష్ట్ర కోసం, దేశం కోసం పాటుపడాలన్నారు. అలాగే అంబేడ్కర్‌ ఆశయాలు తూట్లు పడకుండా పాలకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన అందించాలన్నారు. ఈ దీక్షలో పాల్గొన్నందుకు తనకు ఆనందంగా వుందన్నారు. వారి సమస్యలకు తగిన పరిష్కారం త్వరలో దొరుకుతుందని ఆశిద్దామన్నారు. ఈ విజయం వాల్మీకుల అందరి సమిష్టి విజయమని వారందరికీ శుభాభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *