Breaking News

నగరంలో ఆర్.కె 143 చిత్ర యూనిట్ సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాగూర్ బాబు మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.కె 143 “ఏ ప్యూర్ లవ్ స్టోరీ” చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శక నిర్మాత షేక్ జాకీర్ హుస్సేన్ అన్నారు. నాగూర్ బాబు మూవీ మేకర్స్ బ్యానర్ పై మొదటి చిత్రంగా షేక్ జాకీర్ హుస్సేన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఆర్.కె 143 ఏ ప్యూర్ లవ్ స్టోరీ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది.ఈ సందర్భంగా శుక్రవారం గాంధీనగర్ లో ఆర్.కె 143 చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా షేక్ జాకీ హుస్సేన్ మాట్లాడుతూ చిత్ర కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. మంచి విలువలతో కూడుకున్న కథని ఎంచుకున్నామని, హీరోగా వారి బ్యానర్లో దర్శకుడు అయినటువంటి శివరాం కుమార్ ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. మరో హీరోగా తేజ్ బ్రహ్మ నటిస్తున్నారని, హీరోయిన్లు గా సౌజన్య, పద్మావతి లను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి మెగా మూవీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఎస్ నాయుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నవంబర్ నెలకే ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ లోనే చిత్రీకరిస్తామని చెప్పారు. అమరావతి మెగా మూవీ అసోసియేషన్ సెక్రటరీ, దర్శకులు శివ మాట్లాడుతూ హీరోగా తొలి చిత్రం కావడం అందులో హుస్సేన్ మూవీ లో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్రాలు నిర్మితమైతే ఇక్కడ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *