విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమం, సుపరిపాలనతో అన్నివర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు రాష్ట్ర పురోభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 23వ సచివాలయ పరిధిలోని గుణదల రామాలయం గుడి రోడ్,గాంధీబొమ్మ సెంటర్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసారు. సాంకేతిక కారణాల వలన ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే వారి వద్ద నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మెనిఫెస్టో లో చెప్పిన విధంగా నవరత్నాలు అమలు చేస్తు 95శాతం పైగా హామీలను కేవలం మూడేళ్ళ కాలంలో అమలు చేయడం జరిగిందని అన్నారు.గత 20రోజులుగా నగరంలో అతి పెద్దదైన ఈ 3వ డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు వివరించడం జరిగింది. అదేవిధంగా కాలనీ లు,కొండ ప్రాంతం మిళితమైన ఈ డివిజన్ లో కొండంచున నివసిస్తున్న వారి వద్దకు కూడా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని,ప్రభుత్వ పనితీరు పట్ల మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తూ మాకు ఘన స్వాగతం పలకడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు.నిన్న ముఖ్యమంత్రి తో జరిగిన సమావేశంలో కొండప్రాంత వాసుల ఇళ్ల పట్టాలు సమస్య,కృష్ణలంక రెగ్యులరైజ్ గురుంచి,22వ డివిజన్ శ్మశాన వాటిక ,షాధికాన నిర్మాణం గురుంచి వివరించగా సానుకూలంగా స్పందించిన ఆయన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. జెండా తప్ప అజెండా లేని ప్రతిపక్షాలు అన్ని కలిసి ప్రభుత్వన్ని గద్దె దించుతామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని, వారెన్ని డ్రామాలు ఆడిన ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని,ప్రజల గుండెల్లో జగన్ గారే ఉన్నారని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ్,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు డేవిడ్ రాజు,ఏలూరి శివాజీ,బండి మారుతీ,లీల వినోద్, శ్రీకాంత్, కళ్యాణ్, రామకృష్ణ, గణేష్ బాబు,నాని,కిస్సి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News