విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ కామినేని నగర్ లో పర్యటించినప్పుడు కుటుంబ పోషణకు కోసం ఇబ్బంది పడుతున్న వెంకట లక్ష్మి వెంకట లక్ష్మి అనే మహిళకు జీవనోపాధి నిమిత్తం దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా రూ 7,000/- విలువ చేసే నూతన కుట్టు మిషన్ ను తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వారికీ అందజేశారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ స్పూర్తితో విజయవాడ నగరంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తన్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,తుంగం జాన్సీ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News