Breaking News

పార్టీ ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా ది కీలకపాత్ర పోషించింది అందుకే అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ వారి సేవలను గుర్తించి పార్టీలో,ప్రభుత్వం లో తగు ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్, కోకన్వీనర్లు రాజేష్,జావీద్,సాయి కుమార్,ప్రవీణ్ లు నియమితులైన సభ్యులు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా అవినాష్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మీ మీద నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయ్యేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామంటూ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *