Breaking News

గోదావరి హారతి కార్యక్రమానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి…

-ఈ నెల 31 వతేదిన గోష్పాద క్షేత్రం లో గోదావరి హారతి కార్యక్రమం.
-కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి హారతి కార్యక్రమానికి అధికారులు పగడబంది ఏర్పా ట్లు చెయ్యాలని కొవ్వూరు కొ వ్వూరు ఆర్డీఓ ఎస్.మల్లిబాబు అన్నారు.

శనివారం ఆర్డీఓ కార్యాలయం లో గోదావరి హారతి ఏర్పాట్లు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ ఈ నెల 31 వతేదిన గోష్పా ద క్షేత్రం లో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందన్నారు. గోష్పాద క్షేత్రంలో 21 సేఫ్టీ బోట్లు మరియు ఒక రెస్క్యూ బోట్ తగిన సంఖ్యలో గజ ఈత గాళ్లను ఏర్పాటు చేయాలని పిషరీస్ ఏడి బి. సైదా నాయక్ కు స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని లైట్లు, మైకుల విద్యుద్దీకరణ కోసం పవర్ సాకెట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఎ. డీ ఈ, ట్రాన్స్‌కో శాఖ లకు సూచనలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగు నీరు, లైటింగ్‌ ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమా నికి హాజరయ్యే ప్రజలకు మరియు భక్తులకు LED లైట్లు, డస్ట్‌బిన్‌లు, పార్కింగ్ ప్లేస్ మరియు మరుగుదొడ్లు ఏర్పా ట్లు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, విద్వాన్ పగడాల ఆనంద తిర్థ ఆచార్యులు మాట్లాడుతూ అఖండ గోదావరి నదిని సందర్శిస్తే చాలు అనేక జన్మల పాపాలు తొలగిపోతా యని గౌతమ్ని గోహత్య మహా పాతకాన్ని తొలగించడానికి పరమశివుడి జటాజూటాల నుండి భూమికి వచ్చిన అఖండ గోదావరి కొవ్వూరులో చనిపో యిన గోవుల పైనుంచి ప్రవహిం చి గోహత్య మహాపాతకాన్ని తొలగించి ఇక్కడ నుండి సప్త గోదావరి సాగరంలో కలుస్తుం దన్నారు.అటువంటి జీవనది గోదావరిని దర్శనం స్థానం పూ జ హారతి అందించడం ద్వారా విశేష ఫలం లభిస్తుందని తిరు మల తిరుపతి దేవస్థానం అంద రినీ కలుపుకొని గోదారమ్మ హా రతి అందించడం జరుగుతుం దన్నారు. అక్టోబర్ 31వ తేదీ సోమవారం కొవ్వూరు గోష్ప్రద క్షేత్రంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు సంకీర్తన భజన సంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. నది వైవిష్టం హారతి వైవిష్టం కార్తీకదీపం గురించి వివరించ డం జరుగుతుందన్నారు. ముందుగా శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు గోదావరి మాతకు మహా మంగళహారతి అందిం చడం జరుగుతుందన్నారు. ఈ హారతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోదావరి హారతి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సు లు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, విద్వాన్ పగడాల ఆనందతిర్థ ఆచార్యులు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, పట్టణ సీఐ ఏఎల్ఎస్ రవికుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొ న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *