విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం విజయవాడ మధ్య నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ (చిన్ని) సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేట కేర్ అండ్ షేర్ స్కూల్ వద్ద 300 మంది నిరుపేదలకు భోజనం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి పేదవాడి సంక్షేమమే అజెండాగా పాటిస్తున్న తెలుగుదేశం పార్టీ అని ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం ప్రవేశపెట్టినప్పటి నుంచి పేదవాడి కడుపు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు చే ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్లు ఎంతమందో పేదల కడుపు నింపిందని, ఈనాడు వైసీపీ ప్రభుత్వం వాటిని తీసివేసి పేద,బడుగు వాళ్ల కడుపు మీద కొట్టారని విమర్శించారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని కచ్చితంగా అన్నా క్యాంటీన్లు తెరిచి తీరతామని తెలియజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ప్రజల జీవన స్థితిగతులు మారాయని రెండు పూటలా కడుపు నిండటం నిరుపేదలకు కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నడపబడుతున్న కేసినేని ఫౌండేషన్ వారి సహకారంతో సెంట్రల్ నియోజకవర్గం లోని 21 డివిజన్లలో మొబైల్ అన్న క్యాంటీన్లు ఎన్నికల వరకు పేదల కడుపు నింపుతాయి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘు, 57వ డివిజన్ అధ్యక్షుడు బోని సన్యాసిరావు, గంటా కృష్ణమోహన్, పరుచూరి ప్రసాద్, దీవి ఉమామహేశ్వరరావు, ఆల తారకరామారావు, సింగం వెంకన్న, నాగుల్ మీరా, బత్తుల రామకృష్ణ,పాల మాధవ, సొంటి ఈశ్వరీ, శ్రీనివాస గుప్తా గొట్టుముక్కల వెంకీ, లక్ష్మీ, తిరుపతి, లీల, వెంకటేశ్వర్లు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News