Breaking News

61 వ డివిజన్ లో నిరుపేదలకు భోజనం పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం విజయవాడ మధ్య నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ (చిన్ని) సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు  ఆధ్వర్యంలో 61 వ డివిజన్ హెచ్ బ్లాక్ వద్ద 300 మంది నిరుపేదలకు భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోండా ఉమామహేశ్వర పాల్గొని మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు  పార్టీ పెట్టినప్పటి నుంచి పేదవాడి సంక్షేమమే అజెండాగా పాటిస్తున్న తెలుగుదేశం పార్టీ అని ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం ప్రవేశపెట్టినప్పటి నుంచి పేదవాడి కడుపు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారిచే ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్లు ఎంతమందో పేదల కడుపు నింపిందని, ఈనాడు వైసీపీ ప్రభుత్వం వాటిని తీసివేసి పేద,బడుగు వాళ్ల కడుపు మీద కొట్టారని విమర్శించారు.మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని కచ్చితంగా అన్నా క్యాంటీన్లు తెరిచి తీరతామని తెలియజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ప్రజల జీవన స్థితిగతులు మారాయని రెండు పూటలా కడుపు నిండటం నిరుపేదలకు కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న కేసినేని ఫౌండేషన్ వారి సహకారంతో సెంట్రల్ నియోజకవర్గం లోని 21 డివిజన్లలో మొబైల్ అన్న క్యాంటీన్లు ఎన్నికల వరకు పేదల కడుపు నింపుతాయి అని స్పష్టం చేశారు.61 వ డివిజన్ పరిధిలో పేదలు నివసించే ప్రతి చోట కూడా మొబైల్ అన్న క్యాంటీన్ తన సేవలు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 61 వ డివిజన్ ఇంచార్జ్ శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు దాసరి దుర్గారావు పెప్సీ, డివిజన్ సెక్రెటరీ అమ్మా రావు, సెంట్రల్ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, డివిజన్ బీసీ నాయకులు శ్రీను, అన్నా బత్తుల శీను, వలివేటి శ్రీను, పగడాల వెంకటేశ్వరావు, భరణి డివిజన్ మహిళా నాయకురాలు శివకుమారి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *