-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశం లో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రవేశ పెట్టి పేద బడు గుబాలహీన వర్గాల ప్రతి గడప గడపకువెళ్లి సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ అన్నారు. నగరంలోని 14 వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ నాగేంద్ర కె.బాబు ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ సచివాలయం-1 పరిధిలోని ప్రకాష్ నగర్, ఎన్టీఆర్ నగర్, చంద్ర మౌళి నగర్ లలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. 54వ రోజు న “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు రెఫర్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
1)సాళ్వ భారతి తనకు వైఎస్ ఆర్ ఆరోగ్య ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ , జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదు ల ద్వారా రూ. 10 లక్షల, 70 వేల 215 అందాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జగనన్న ప్రభుత్వమే కలకాలం ఉండాలని అన్నారు.
2)పాలగిరి హుస్సేన్ బీ తనకు వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ ఆర్ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న అమ్మ ఒడి, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదు ల ద్వారా తనకు రూ.9 లక్షల, 24 వేల 937 లు పథకాల ద్వారా అందాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కి కలకాలం రుణ పడి ఉంటామని తెలిపారు.
3)వదతి లాక్షుమ్మ తనకు వైఎస్ ఆర్ సున్నా వడ్డీ,జగనన్న వసతి దీవెన, జగనన్న విద్య దీవెన, వైఎస్ ఆర్ పింఛన్ కానుక, ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదు ల ద్వారా రూ.9 లక్షల, 91 వేల 783 లు లబ్ది పొందానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలకాలం ఆయనే ముఖ్యమంత్రి గా ఉండాలని అన్నారు.
4)సిర్రోల్ల లక్ష్మీ దేవి తనకు వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ ఆర్ ఆసరా, వైఎస్ ఆర్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదు ల ద్వారా రూ.10 లక్షల 03 వేల 058 లు లబ్ధిచేకూరిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జగనన్న మరి మరి ముఖ్యమంత్రి గా ఉండాలని అన్నారు.
5)పి. గోవిందమ్మ తనకు జగనన్న అమ్మ ఒడి,వైఎస్ ఆర్ఆరోగ్య ఆసరా, వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదు ల ద్వారా రూ.9 లక్షల, 29 వేల 524 ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది కలిగిందని ఎంతో సంతోషంతో జగనన్నే ముఖ్యమంత్రి గా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు నగర 14 వ డివిజన్ కార్పొరేటర్ కె. బాబు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి, వైకాపా నాయకులు, నాయకురాళ్లు, వైకాపా నగర అధ్యక్షులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, డైరెక్టర్లు, ఇతర నగర కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News