విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులయిన వారిని మంగళవారం నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అగ్నిప్రమాద ఘటనలు జరగడం బాధాకరం అని, రామలింగేశ్వర నగర్ కు చెందిన పండు, 21వ డివిజన్ హరిజన సేవ సంఘం రోడ్ నివాసి కానూరు ఆనంద్ లకు చెందిన నివాసాలు అగ్నిప్రమాదంలో దెబ్బతిన్నాయని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ప్రభుత్వం ద్వారా తగు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ధైర్యం చెప్పారు. బాణసంచా కాల్చేటప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు,కార్పొరేటర్ పుప్పాల కుమారి,తాటిపర్తి కొండారెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News