విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టి అర్హతే ప్రామాణికంగా అవినీతిరహిత పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 27వ సచివాలయం పరిధిలోని కుమ్మరి బజారు, నెహ్రూ స్టాట్యూ రోడ్,పాండురంగ స్వామి గుడి ప్రాంతంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులతో కలిసి ఇంటిఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజలు మొదటినుంచి కూడా స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ దేవినేని నెహ్రూ లకు ఎంతో అభిమానంగా ఉండేవారని అదే అభిమానం ప్రేమ ఇప్పుడు నా మీద, జగన్ మీద చూపిస్తున్నారని అన్నారు. నాడు వైయస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మరలా నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తున్నారు అని ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. అలాగే గతంలో పెన్షన్లు తీసుకోవడానికి కార్యాలయాల చుట్టూ కళ్ళారిగెల తిరగాల్సి వచ్చేది అని, సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని కానీ నేడు అర్హత ఉంటే చాలు నేరుగా ఇంటికే సంక్షేమ లబ్ది అందిస్తున్నారని ప్రజల సంపూర్ణ మద్దతు మా ప్రభుత్వనికి ఉందని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతవాసుల ముఖ్య సమస్య ఇళ్ళ పట్టాల రెగ్యులరైజ్ అని ఇటీవల ముఖ్యమంత్రి ని కలిసి ఈ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారని వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలుపగ ఆయన తక్షణమే ఆ సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్ఠడంతో పాటు వారికి అండగా ఆర్థిక సహాయం అందించిందని, అంత అయ్యాక ఇప్పుడు టీడీపీ నాయకులు వెళ్లి షో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం లో నాసిరకం రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారు నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో నిర్మించిన వాల్ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అని, మీరెన్ని రాజకీయాలు చేసిన ప్రజలకు వాస్తవాలు తెలుసని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు, చంద్ర, రాఘవలు, చందా కిరణ్, చెన్ను, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News