Breaking News

గురువారం నుంచి సాధారణ ట్రాఫిక్ అనుమతి…

-రోడ్ కం రైల్వే వంతెన మరమ్మత్తుల అనంతరం అక్టోబర్ 27న పునః ప్రారంభం
-కలెక్టర్ కె. మాధవీల

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం (అక్టోబర్ 27) ఉదయం నుంచి రోడ్ కం రైలు వంతెన మరమ్మత్తులు అనంతరం పునః ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత బుధవారం రాత్రి ఒక ప్రకటన లో వెల్లడించారు. అక్టోబర్ 15 వ తేదీ నుంచి గోదావరి రోడ్ కం రైల్ వంతేన కు చేపట్టవలసి వొచ్చిన పనుల నిమిత్తం ట్రాఫిక్ ను మళ్ళించడం జరిగిందన్నారు. తదనుగుణంగా ప్యాచ్ వర్క్ లను, రైలింగ్ మరామ్మత్తు లను అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పై వంతెన పై పడిన గోతులను పూడ్చి వేసే పనులను, రైలింగ్ దెబ్బతిన్న ప్రాంతాల్లో తొలగించి ఐరన్ రైలింగ్, ఫుట్ పాత్ దెబ్బతిన్న ప్రాంతంలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు, కొవ్వూరు వైపు స్లాబ్ పనులను చేపట్టినట్లు ఆర్ అండ్ బి అధికారులు వెల్లడించారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *