Breaking News

నగరంలో చింతామణి సొంతమొగుడు చిత్ర యూనిట్ సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ కథాచిత్రంగా చింతామణి సొంతమొగుడు చిత్రం నిర్మించామని కథ, స్క్రీన్ ప్లే నిర్మాత, దర్శకుడు శివ నాగేశ్వరరావు తెలిపారు. నవంబర్ 4 న చింతామణి సొంతమొగుడు చిత్రం విడుదల సందర్భంగా బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో జూనియర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చింతామణి సొంతమొగుడు చిత్రం కోసం నిదురలేని రాత్రులు గడపామని వివరించారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నామని వివరించారు. మంచి నటులతో ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రేక్షకులు ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నానని వెల్లడించారు. సినిమా దర్శకుడు శివ నాగేశ్వరరావు వేగేళ్ల మాట్లాడుతూ ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని చింతామణి సొంతమొగుడు చిత్రాన్ని నిర్మించామని, ఉభయ రాష్ట్రాలలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం నటీనటులతో పాటు అందరూ కష్టపడి పనిచేసారని వెల్లడించారు.కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *