Breaking News

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
-ఆంధ్ర ప్రదేశ్ లో మూడురోజుల పర్యటన లో భాగంగా ఈ రోజు రాత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ చేరుకోనున్నారు.

-27వ తేదీ ఉద‌యం రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా, వీర‌వాస‌రం మండ‌లం మ‌త్స్య‌పురం గ్రామానికి వెళ్ల‌నున్నారు. గ‌తంలో పార్లమెంట్ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రధాన మంత్రి సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద నిర్మలా సీతారామన్ పెదమైనవాని లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

-మ‌త్స్య‌పురం గ్రామంలో గం. 11:00 ల‌కు “ర్యాపిడ్ శాండ్ ఫిల్ట‌ర్ ఆఫ్ డ్రింకింగ్ వాట‌ర్ స్కీమ్ “ను ప‌రిశీలించ‌నున్నారు.

-అనంత‌రం మ‌త్స‌పురం నుంచి న‌ర్సాపురం చేరుకుంటారు.

-27వ తేదీ మ‌ద్యాహ్నం గం. 01:30 ల‌కు పి.ఎమ్. లంక గ్రామంలోని డిజిట‌ల్ క‌మ్యూనిటీ సెంట‌ర్ ను సంద‌ర్శిస్తారు. డిజిట‌ల్ క‌మ్యూనిటీ సెంట‌ర్ నుంచి “ ఏంటీ ఎరోష‌న్ ఎంబ్యాంక్మెంట్ & స్కిల్ డెవెల‌ప్మెంట్ ప్రాజ‌క్టు” ను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుంటారు.

-28వ తేదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు:

-ఉద‌యం గం 09:30 ల‌కు జెఎన్ట్టీయూ ప్రాంగణంలోని “ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) క్యాంప‌స్ “ ను ప్రారంభించ‌నున్నారు.

-అనంత‌రం రోడ్డు మార్గంలో విశాఖ‌ప‌ట్నం బ‌య‌లుదేరి వెళ్తారు.

-సాయంత్రం గం. 04 00 ల‌కు గీతం యూనివ‌ర్శిటీ ఆడిటోరియంలో నిర్వ‌హించే “ఎన్టీఆర్ మెమోరియ‌ల్ లెక్చ‌ర్” లో పాల్గొంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *