Breaking News

విద్యుత్ ఉత్పత్తి పెంపు దిశగా కీలక అడుగు


-శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-2 (800 మెగావాట్లు) ప్లాంట్ను (నేడే) అక్టోబర్ 27 , 2022న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
-విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, నిరంతర , నాణ్యమైన చౌక విద్యుత్ సరఫరాను అందించడం , విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించడం పై విద్యుత్ సంస్థలు ఫోకస్
-ఎస్డీఎస్టీపీఎస్ కృష్ణపట్నం స్టేజ్ 2 (800 MW), Dr.ఎన్టీటీపీఎస్ ఇబ్రహీంపట్నం (800 MW) రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించడానికి ఒక ప్రధాన అడుగు.
-దేశంలో వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి – ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-Dr.ఎన్టీటీపీఎస్ ఇబ్రహీంపట్నం (800 MW) ప్లాంట్ ను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు
-2018-19లో 3.10 శాతం ఉన్న ప్రసార నష్టాలు 2022-23లో 2.83 శాతానికి (మే-22 వరకు) తగ్గించబడ్డాయి.
-సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే సూపర్ క్రిటికల్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి తక్కువ మొత్తంలో బొగ్గును వినియోగం
-ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది
-రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు ఏవైనా ప్రజాసేవ కోసమే – ఇంధన శాఖ మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసి ఇంధన భద్రతను సాధించడంలో భాగంగా మూడు అంశాల పై విద్యుత్ సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయటం , సాంకేతిక వాణిక్య నష్టాలను తగ్గించటం పై విద్యుత్ సంస్థలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పట్టపగలే 9 గంటల కరెంటు సరఫరా కు గట్టి గారెంటీ ఇస్తూ , భవిష్యత్లో కూడా శాశ్వత ప్రాతిపదికన 24×7 నిరంతర నాణ్యమైన విద్యుత్ ను అందుబాటు ధరల్లో వినియోగదారులకు సరఫరా అయ్యేలా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .

విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో భాగంగా, నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (SDSTPS) స్టేజ్ 2 (800 MW) కృష్ణపట్నం ప్లాంట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడే (అక్టోబర్ 27న) ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ దృష్ట్యా , ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి SDSTPS కృష్ణపట్నం ప్లాంట్ను సందర్శించారు. తదుపరి ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె విజయానంద్, సి ఎం డీ ఏ పీ ట్రాన్స్కో , ఎం డీ ఏ పీ జెన్కో , బీ శ్రీధర్ ఇతర ఇంధన శాఖ అధికారులతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పై సమీక్ష నిర్వహించారు.

ఎస్డిఎస్టిపిఎస్ కృష్ణపట్నం స్టేజ్ 2 (800 మెగావాట్లు) తో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఎన్టిటిపిఎస్ ఇబ్రహీంపట్నం (800 మెగావాట్లు) ప్లాంట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి . ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికి గ్రిడ్ డిమాండ్ ను అందుకోవడానికి , వినియోగదారులకు 24×7 నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి ఈ ఉత్పత్తి కేంద్రాలు ఎంతో దోహదపడతాయని ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు

కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్ ద్వారా రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే సూపర్ క్రిటికల్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి తక్కువ మొత్తంలో బొగ్గును వినియోగిస్తుంది. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కూడా కొంత మేర తగ్గుతుంది . SDSTPS స్టేజ్-2 యూనిట్ పూర్తిగా దేశీయంగా ఉత్పత్తి చేయబడిన బొగ్గుతో నడిచేలా రూపొందించబడింది. అందువల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గేందుకు అవకాశం ఉంది
.
SDSTPS ప్లాంట్ ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పవచ్చు . మొదటి దశలో, ఈ ప్లాంట్ లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ప్రారంభించబడ్డాయి. అలాగే రెండవ దశలో, మరో 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ను ముఖ్యమంత్రి ఈ నెల 27న ప్రారంభించనున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం పై పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కృష్ణపట్నం 2వ యూనిట్తో పాటు ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్లో మరో 800 మెగావాట్ల యూనిట్ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది .

రాష్ట్రంలోని వినియోగదారులకు చౌక విద్యుత్ను అందించే చర్యల్లో భాగంగా విద్యుత్ సంస్థలు బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయడం, ఇతర ఉత్తమ సాంకేతిక , యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్లు గత మూడేళ్లలో ఆదా చేయటం జరిగింది. .

మరోవైపు ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించేందుకు విద్యుత్ సంస్థలు అనేక చర్యలు చేపట్టాయి. 2018-19లో 3.10 శాతం ఉన్న విద్యుత్ ప్రసార నష్టాలు 2022-23లో 2.83 శాతానికి (మే-22 వరకు) తగ్గించబడ్డాయి. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా పరిగణిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్లపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు చొరవ తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారని ఇంధన శాఖ మంత్రి చెప్పారు. కేవలం రైతుల కోసమే సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని దశలవారీగా 7000 మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేయనున్నారు. దీనివల్ల రాబోయే 30 ఏళ్ల పాటు రైతాంగానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం దేశంలో కేవలం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే అని ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.

“SECI నుండి సౌర విద్యుత్ కొనుగోలు , ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు నిర్మాణం, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, డే ఎహెడ్ ఎనర్జీ ఫోర్కాస్టింగ్ మోడల్ వంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు ఏమైనప్పటికీ, అవి ప్రజా ప్రయోజనాల కోసమే , ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో మాత్రమే” అని ఇంధన శాఖ మంత్రి అన్నారు.

గత సంవత్సరం అక్టోబర్ నెలలో దేశ వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర మైన బొగ్గు కొరత కారణంగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు అద్భుతమైన పనితీరును కనబరిచాయని మంత్రి పేర్కొన్నారు . గృహ వినియోగదారులకు 24 x 7 విద్యుత్ సరఫరా కు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు . అంతేగాక అటువంటి సంక్షోభ సమయంలోనూ జాతీయ సగటు విద్యుత్ వినియోగం తో పోలిస్తే మన సగటు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటం గమనార్హం అని అయన తెలిపారు. బొగ్గు కొరత సంక్షోభాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు విజయవంతంగా ఎదుర్కోగలిగాయండానికి ఇదే అతి పెద్ద నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విద్యుత్తు సంస్థలు దృష్టి పెట్టాయని తెలిపారు.

SDSTPS కృష్ణపట్నం స్టేజ్ 2 నిర్మాణంలో భాగస్వాములైన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ , ఎండీ ఏపీ జెన్కో బి శ్రీధర్, APGENCO, AP పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APPDCL) ఇంజనీర్లు మరియు సిబ్బంది ని ఇంధన శాఖ మంత్రి అభినందించారు.

ఈ సమావేశంలో ఏపీజెన్కో డైరెక్టర్ థర్మల్, జి చంద్రశేఖరరాజు, డైరెక్టర్ ఫైనాన్స్ బి వెంకటేశులు రెడ్డి, డైరెక్టర్ బొగ్గు, ఆంటోని రాజా, డైరెక్టర్ హైడల్, ఎంవీవీ సత్యనారాయణ, జెన్కో చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *