-బుధవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో గోడ ప్రతి ఆవిష్కరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబరులో జిల్లాలో జగనన్న క్రిడా సంబరాలు ఘనంగా నిర్వహించే దిశలో జిల్లా క్రీడా సాధికారిత సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లో జగనన్న క్రీడా సంబరాల గోడ ప్రతిని ను కలెక్టర్ ఆవిష్కరించారు. క్రీడా సంబరాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అధికారులకు పిలుపు నిచ్చార్యు. అనంతరం జిల్లా క్రీడల చీఫ్ కోచ్ శేషగిరి రావు క్రీడా సంబరాల వివరాలను తెలిపారు. కబడ్డీ (మహిళలు, పురుషులు), వాలీ బాల్ (మహిళలు, పురుషులు), క్రికెట్ (పురుషులు), బాడ్మిం టన్ (సింగిల్, డబుల్) అంశాల్లో పోటీలు నిర్వహించేం దుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిం దన్నారు. 2022 డిసెంబరు 31 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుని, జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లో సభ్యత్వం కలిగిన అభ్యర్థులు ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనేందుకు అర్హుల న్నారు. బాడ్మింటన్ సింగిల్స్‌లో పాల్గొనే క్రీడాకా రులు రూ.200, డబుల్స్‌లో పాల్గొనే క్రీడా కారులు రూ.300 ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. క్రీడాకారులు తమ ఆధార్, జగనన్న స్పోర్ట్స్ క్లబ్ గుర్తింపు కార్డుల ధ్రువీకరణకు ఇవ్వాలని సూచించారు.
నాలుగు దశల్లో క్రీడా సంబరాలు
క్రీడా సంబరాలు నాలుగు దశలలో నిర్వహించను న్నారు. మొదటి దశను నియోజక వర్గం స్థాయిలో నవంబరు 10లోగా, రెండవ దశలో జిల్లా స్థాయిలో నవంబరు 20 నుండి 25లోగా నిర్వహిస్తారు. మూడవ దశ జోనల్ స్థాయిలో డిసెంబరు 10లోగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయి పోటీలను డిసెంబరు 20, 21 తేదీల్లో నిర్వహించుటకు చర్యలు చేపట్టారు. జోనల్ స్థాయిలో వాలీబాల్ శ్రీకాకుళంలో, కబడ్డీ విశాఖల, క్రికెట్, బాడ్మింటన్ విజయనగరంలో నిర్వహి స్తారు. క్రీడలను నాక్ అవుట్ పద్దతిలో నిర్వహిస్తారు.
మొదటి బహుమతి రూ.5 లక్షలు
జగనన్న క్రీడా సంబరాల్లో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన బందాలకు భారీ నగదు బహుమతులను క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించింది. కబడ్డీ (మహిళలు, పురుషులు) మొదటి స్థానానికి రూ.5 లక్షలు, రెండవ స్థానానికి రూ.3 లక్షలు, సెమీ ఫైనల్స్ లో ఓడిన జట్లకు లక్ష రూపాయలు చొప్పున., వాలీ బాల్ (మహిళలు, పురుషులు)లి మొదటి స్థానానికి రూ.3 లక్షలు, రెండవ స్థానానికి రూ.2.50 లక్షలు, సెమీ ఫైనల్స్‌లో ఓడిన బందాలకు రూ.50 వేలు చొప్పున, క్రికెట్ (పురుషులు) మొదటి స్థానానికి రూ.5 లక్షలు, రెండో స్థానానికి రూ.3 లక్షలు, సెమీ ఫైనల్స్‌లో ఓడిన బందాలకు లక్ష రూపాయలు చొప్పున., బాడ్మింటన్ (సింగిల్) మొదటి స్థానానికి లక్ష రూపాయలు, రెండవ స్థానానికి రూ.50 వేలు, సెమీ ఫైనల్స్ లో ఓడిన అభ్యర్థులకు రూ.25 వేలు చొప్పున., బాడ్మింటన్ (డబుల్) మొదటి స్థానానికి లక్ష రూపాయలు, రెండవ స్థానానికి రూ.50 వేలు, సెమీ ఫైనల్స్ లో ఓడిన అభ్యర్థులకు రూ.25 వేలు చొప్పున బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా క్రిడాధి కారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News