Breaking News

అక్టోబర్ 31 న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతి వేడుకలు

-నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
-జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నాం
-జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 31 న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, బొమ్మూరు నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సదర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉదయం 9.00 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, అనంతరం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలలో జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరు కావలసినదిగా జిల్లా కలెక్టర్ మాధవీలత కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *