Breaking News

మంచి పరిపాలనకు వ్యూహకర్తలు అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని అది ఎక్కడైనా ఉండవచ్చనీ రాజకీయ వ్యూహకర్త తాత సుబ్రమణ్యం అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తాత సుబ్రమణ్యం మాట్లాడుతూ మూడు రాజధానులు తన అభిమతం కాదని రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, బూతులు మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయాలు ఎలా చేయాలో చెబుతానని వివరించారు. ఈనాడు రాజకీయాలు చూస్తే చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యకి గత దుషణాలతో రాజకీయాలు చేస్తున్నారని అది సరైన పద్ధతి కాదని అన్నారు. నేడు జరుగుతున్న రాజకీయం రాజకీయ పార్టీలపై కాదని మూడు రాజధానుల పైనే ఉంటుందని తెలియజేశారు. రాజధాని పై దేశంలో ఏ రాష్ట్రానికి లేని సమస్య మన రాష్ట్రానికి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓకే రాజధానికి ఓటు వేస్తానని వెల్లడించారు. రాష్ట్రంపై ఒక వ్యూహకర్తగా తనకు స్పష్టమైన అవగాహన ఉందని సూచించారు. రాష్ట్ర పరిస్థితులపై 36 పేజీలతో కూడిన సమగ్రమైన ప్రణాళికతో పట్టణంలోని ఒక శాసనసభ్యునీ కలవుగా తనకు అవమానాలు ఎదురయ్యాయని వెల్లడించారు. ఆహ్లాదకరమైన రాజకీయాలకు సమాజంపై, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యూహకర్తలు అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *