Breaking News

వికేంద్రీకరణకు మద్దతుగా విజయ సంకల్ప దీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి తలపెట్టిన మూడు రాజధానులకు మద్దతుగా జాతీయ మాల మహానాడు తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అత్తా యోనారాజు అన్నారు. ధర్నా చౌక్ లో సోమవారం జరిగిన ఒకరోజు దీక్షలో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ దీక్షలో పాల్గొన్న యోనా రాజు మాట్లాడుతూ వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఒకరోజు దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *