విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టి కొండప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 26వ సచివాలయం పరిధిలోని బేత్లెహం నగర్ కొండ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలన గాడిన పడింది అని,మా బ్రతుకుల్లో వెలుగులు నిండాయని ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తూ గడపగడపకు వస్తున్న వైసీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఈ కొండ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది లేదని కొండంచున నివసించే వారు పైకి వెళ్ళడానికి సరైన మెట్ల మార్గాలు కూడా లేకుండా ప్రమాదకరమైన పరిస్థితులు ఉండేవని, కనీసం ఇక్కడ నివసించే వారికి సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేవారు కాదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నూతన మెట్లు మార్గాలతో పాటు నడిచే వారికి భద్రత కోసం ఇరువైపులా రైలింగ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. కొండంచున నివసించే వారికి కూడా వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు గాని, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలు,ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వారికి అండగా నిలబడింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు.కేవలం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే దాదాపు 450 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపటద్దం జరిగిందని, కేవలం వారి రాజకీయ మనుగడ కోసం ప్రచార అర్భటల కోసమే తెలుగుదేశం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి మీద ఈ మూడేళ్ళ కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోండి అని హితవు పలికారు. మీరెన్ని అబద్ధపు ప్రచారాలు చేసిన సరే ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని ,వారి సంపూర్ణ మద్దతు వైసీపీ ప్రభుత్వనీకె అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు, డేవిడ్ రాజ్,చందా కిరణ్, సుధాకర్, సుమన, అనిల్, రమేష్, విజయ, చార్లీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News