-దళిత బహుజన సంఘాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మారుమూడి విక్టర్ ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని 60 దళిత సంఘాలు ఖండించారు. ఐలాపురం కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నాయకులు పలువురు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పై ఆధిపత్య కులాలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలను కావాలని రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజాయితీకి నిబద్ధతకు మారుపేరైన, 40 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన విక్టర్ ప్రసాద్ నీ విమర్శించడం సిగ్గుగా ఉందని, ఆయనకు రాష్ట్రంలోని దళిత సంఘాలన్నీ అండగా ఉంటామని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల్లో వారి హక్కులపై చైతన్యం తీసుకురావడానికి అన్ని సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మేదర సురేష్ కుమార్, మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల అధ్యక్షులు మాదిగాని గురునాథం, దాసరి సువర్ణ రాజు, దాసరి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News