Breaking News

“విజిలెన్సు అవగాహన వారొత్సవములు”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డైరెక్టర్ జనరల్, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశానుసారం నిర్వహింపబడుతున్న “విజిలెన్సు అవగాహన వారొత్సవములు” లో భాగంగా టి. కనకరాజు, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి, విజయవాడ వారి ఆధ్వర్యంలో గురువారం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ అధికారుల అసోసియేషన్ హాలు, విజయవాడ నందు విజిలెన్సు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు విజిలెన్సు శాఖ, వ్యవసాయ శాఖ మరియు మరియు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో జి.కళ్యాణ్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు, విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు వాటి పని తీరు సంభందిత విషయాలపై విస్తృత వివరణ మరియు సదరు కేంద్రాలలో ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకుండా చేయవలసిన విధులు, రైతులకు అందించవలసిన మెరుగైన సేవలు గురించి తెలియచేయడం జరిగినది. అలాగే కె.వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, యం. రవికుమార్, తహసీల్దార్ మరియు యం.పరమేశులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ రెవిన్యూ మరియు అటవీ శాఖాల ద్వారా ప్రభుత్వ పధకాలు వాటి విధి విధానాల గురించి విపులంగా విశదీకరించి ఎటువంటి అవినీతి కి తావు లేకుండా విధులు నిర్వర్తించవలసినదిగా సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *