విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ బి సి ఫిట్నెస్ స్థాపకులు సిఎఫ్ బోదిష్ కుమార్ సనమ్ వారి స్టూడెంట్స్ తో కలిసి ఆపకుండా ఏడు గంటలు ఆర్గానిక్ ఏరోబిక్స్ అనే క్యాంపును శుక్రవారం భవానీపురం, సాంస్కృతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. దీనికి గాను వారికి ఆసియన్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. ఇంతకుముందు పూర్తి చేసుకున్న 2.30 గంటలు మరియు 5 గంటలు కూడా ఛాంపియన్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు 7 గంటలు కంటిన్యూగా ఆర్గానిక్ ఏరోబిక్స్అనే క్యాంపును నిర్వహించి మరో రికార్డు సాధించారు. ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేపట్టిన మహిళలు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఫిట్నెస్ గా ఉండి ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యంతో ఉండాలని బోదిష్ కుమార్ సనమ్ తెలిపారు. ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ పట్టాభిరామ్ అవార్డు, సర్టిఫికెట్స్ అందచేసి అభినందించారు. అవార్డు వేరు రికార్డు వేరు. అలాంటి రికార్డు ఏ బి సి ఫిట్నెస్ సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ ఏరోబిక్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News