Breaking News

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యాబోధన చేయాలి…

-గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ పావనమూర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరు మండల పరిధిలో కృష్ణారావుపాలెం డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ పాఠశాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ సాంఫీుక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ పావనమూర్తి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహనను, సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల వసతి గృహాన్ని, భోజనశాలను పరిశీలించి అనంతరం సిబ్బందికి కొన్ని సూచనలు సలహాలు చేశారు. బోదనలో ఉపాధ్యాయులు విద్యార్థులను భాగస్వామ్యులు చేయాలని విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను అందుతున్నది లేనిది ఆరాతీశారు. మరోసారి పాఠశాలను తనిఖి చేస్తామని కార్యదర్శి ఆర్‌ పావనమూర్తి అన్నారు. పరిశీలనలో సంస్థ ఉపకార్యదర్శి జి యోగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్‌ టి రాజేంద్రప్రసాద్‌, వైస్‌ప్రిన్సిపల్‌ వి. శివనారాయణ, పిడి రత్నకిశోర్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *