విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పరిధి లో విధులు నిర్వర్తించుచున్న క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ లకు శనివారం భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయం లో ఒక రోజు వర్కుషాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో బలవర్థకమైన బియ్యం, తనిఖీ శాంప్లింగ్ మరియు విశ్లేషణ 2022-22 ఏకరీతి నిర్దేశాలు, మిల్లింగ్ చేయబడిన బియ్యం నిల్వల యొక్క వయస్సును నిర్ధారించడానికి మిశ్రమ సూచిక పద్ధతి వంటి నూతన విధానాలకు సంబంధించిన నియమాలు, ధాన్యం సేకరణ, సంరక్షణ మరియు ఆహార ధాన్య లోటు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు అండమాన్ నికోబర్ దీవుల కు పంపిణీకి సంబంధించిన అమలు లో ఉన్న ఆదేశాలను పునశ్చరణ చేయుటకు నిర్ణయించడం జరిగింది.
Prajavartha Online Telugu News