Breaking News

రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, వార్డు సచివాలయల వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటి వద్దకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు…

-రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, వార్డు సచివాలయల వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటి వద్దకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శనివారం చాగల్లు గ్రామంలో రూ.40 లక్షలతో రైతు భరోసా కేంద్రంను మంత్రి వనిత ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న సంచాలనాత్మక నిర్ణయం తీసుకొని గ్రామాల్లో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం దిశగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లోనే సచివాలయాలను రైతు భరోసా కేంద్రాలను వైయస్సార్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నా రు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వపరంగా ఏ సహకారం కావాల న్నా వెంటనే తమ సమీపంలో గల గ్రామ సచివాలయంలోనే సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వము అవకాశం కల్పించిందన్నారు. గతంలో ప్రభుత్వపరంగా ఏ కార్యక్రమం కావాలన్నా మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదని నేడు గ్రామం లోని సచివాలయం ద్వారా అ మ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన రైతు భరోసా వంటి అనేక ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు వాలంటీర్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి ప్రజల ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాల అమలు చేసిందని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామం లోని స్థానిక నాయకుల సహకారంతో నేడు ప్రభుత్వ ప్రాధా న్యత భవనాలను సకాలంలో నిర్మించుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొయ్యమణి సొసైటీ అధ్యక్షు లు, సుంకర రాయుడు ఎంపీపీ మట్ట వీరస్వామి ఎ. దొరయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *