విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తర్వాత సంక్షోభం లో ఉన్న రాష్ట్రాన్ని అనుభవంతో గాడిన పెడతారని నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ టీడీపీ నాయకులు సొంత అజెండాతో ప్రజలను దోచుకొన్నారని, అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలకు భరోసా కల్పిస్తు నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోయింది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై ఐదేళ్లు అయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.22వ డివిజన్ మలేరియా హాస్పిటల్ వద్ద గల వైయస్సార్ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి, సామాజిక సేవ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర’కు ఆదివారంతో సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం సృష్టించి చరిత్రకెక్కింది అని అన్నారు.
ఇడుపులపాయ నుండి శ్రీకాకులం వరుకు దాదాపు 3,648 కిలోమీటర్లు తిరిగి పాదయాత్రలో ప్రజలతో మమేకమై, ప్రజల కష్టాలు కళ్లారా చూసి, ప్రజా అవసరాలు మేనిఫెస్టోగా మలచి, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి,నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు ఏ పని కావాలన్న లంచాలు వసూలు చేస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి ఉండేదని విమర్శించారు. టీడీపీ నాయకులు కాల్ మనీ పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తూ లైంగిక దాడులకు తెగబడ్డారు అని విమర్శించారు.చంద్రబాబు అబద్దపు ప్రచారాలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీ లోనే మిగిలిపోతారు. నాడు ప్రజల అవస్థలు చూసి చలించి వారికి భరోసా కల్పించడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర కు శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసారని, గత 40 సంవత్సరాలలో దేశంలో ఎక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా చూసి ఎన్నికల మెనిఫెస్టో రూపొందించి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని 95% అమలు చేస్తున్నారని కొనియాడారు. సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజలు కార్యాలయల చుట్టూ తిరిగే పని లేకుండా, పారదర్శకంగా పధకాలు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనరంజకంగా పరిపాలన అందిస్తూ ప్రజల గుండెల్లో నిలిచేలా పాలన అందిస్తున్నారని, గడపగడపకు మన ప్రభుత్వనికి వస్తున్న స్పందనే అందుకు నిదర్శనం అని తెలిపారు.ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల అవసరాలను గుర్తెరిగిన నిజమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారన్నారు.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని అన్నారు.రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు.,టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి వైస్సార్సీపీ నాయకులు జోగారాజు, నాగిరెడ్డి, ఫజలుద్దీన్, జావీద్, ప్రభాకర్, దర్గా,సురేష్,శ్రీనివాస్ రెడ్డి,కాళీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News