Breaking News

ప్రజల హృదయాల్లో సీఎం వైఎస్ జగన్ స్థానం సుస్థిరం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-ప్రజాసంకల్ప యాత్రలో భాగమైనందుకు గర్విస్తున్నాను

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానం సుస్థిరమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. ముత్యాలంపాడు, కండ్రిక, గిరిపురం, ప్రకాష్ నగర్ సహా పలు ప్రాంతాలలో జరిగిన వేడుకలలో మల్లాది విష్ణు పాల్గొని.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ ప్రజానీకానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జనం గుండె చప్పుడు వింటూ.. దగాపడ్డ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రజా సంకల్ప అడుగులు నేటికీ కళ్ల ముందు మెదులుతునే ఉన్నాయని మల్లాది విష్ణు తెలిపారు. 2017 నవంబర్ 6న తన ప్రజా సంకల్పయాత్రను ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకం నుంచి ప్రారంభించి.. 2019 జనవరి 9 నాటికి ఇచ్చాపురం చేరుకుని చరిత్ర సృష్టించారన్నారు. సుధీర్ఘ పాదయాత్రలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి తానున్నానన్న భరోసాను కల్పించారన్నారు. 14 నెలల కాలంలో పదమూడు జిల్లాలను చుట్టేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకుని కన్నీరు తుడిచారన్నారు. సుమారు మూడు కోట్లమందిని ప్రత్యక్షంగా కలిసి వారి సాదకబాధకాలను విన్న జగన్మోహన్ రెడ్డి.. నాడు గుంటూరు సభలో నవరత్నాలను ప్రకటించారన్నారు. ఆ నవరత్నాల హారమే నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి భగవద్గీతగా మారిందని గుర్తుచేశారు. 3,648 కిలోమీటర్ల దూరం సాగిన ఆ మహాపాదయాత్రలో తానూ ఒక భాగం అయినందుకు గర్విస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తండ్రి వైఎస్ఆర్ స్పూర్తితో పాలన సాగిస్తూ.. అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల కాలంలోనే 98 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని చెప్పుకొచ్చారు. గ్రామ / వార్డు సచివాలయాలు సహా పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న అనేక సంస్కరణలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని కీర్తించారు. అటువంటి గొప్ప నేతకి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాలలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డి, ఆయా డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *