Breaking News

విజిలెన్సు అవగాహన వారోత్సవములు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డైరెక్టర్ జనరల్, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశానుసారం నిర్వహింపబడుతున్న “విజిలెన్సు అవగాహన వారోత్సవములు” ముగింపు సందర్భంగా టి. కనకరాజు, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి, విజయవాడ వారి అధ్యక్షతన ఆదివారం కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పటమట విజయవాడ నందు విజిలెన్సు అవగాహన ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. సదరు కార్యక్రమమునకు విజిలెన్సు శాఖ, అధికారులు మరియు సిబ్బంది మరియు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, నిర్వహించిన వివిధ పోటీలు అనగా డిబేట్, పెయింటింగ్, వ్యాస రచన మరియు క్విజ్ లలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సదరు కార్యక్రమములో కనకరాజు, రీజినల్ విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి, విజయవాడ వారు మాట్లాడుతూ నేటి బాలలు రేపటి భావి పౌరులు, కావున మంచిని అలవాటు చేసుకుని మీ సేవలు నీతి నిజాయితితో అందిస్తూ అవినీతి రహిత సమాజ నిర్మాణానికి నాంది పలకాలని ఆకాంక్షిస్తున్నాని సందేశాన్ని తెలియజేసి విజేతలకు బహుమతులు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *