-టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ అమర్నాథ్ అమలాపురంకి ఏమి చేసాడో చెప్పలేడని, కొడాలి నాని గుడివాడకి ఏమి చేశాడో చెప్పలేడని గుడివాడలో అభివృద్ది శూన్యం, గుడివాడ చేసిన అభివృద్ది శూన్యమని ఇద్దరూ ఇద్దరేనని మాటలతో బూతులతో కొడాలి రెండున్నరేళ్ల కాలం గడిపారని మిగిలిన రెండున్నరేళ్ల కాలం భాధ్యత గుడివాడ నుండి గుడివాడ అమర్నాథ్ కి వచ్చిందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ నాడు మంత్రిగా, నేడు పార్టీ ఇంఛార్జిగా ఈ రాష్ట్రానికి మంగళగిరికి ఏమి చేసారో మేము చెప్పనక్కర్లేదని లోకేష్ సాధించిన అవార్డులు నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్న అవార్డులు నారా లోకేష్ పనితీరుకి నిదర్శమన్నారు. ఇటీవల కాలంలో గుడివాడ అమర్నాథ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లలో సినీ పక్కిలో చేసుకున్న ఫోటో షూట్, వైసిపి మంత్రులు ఎమ్మెల్యేల ఫోటో షూట్ ఖర్చు, 150 మంది శాసన సభ్యుల సోషల్ మీడియా నిర్వహణ ఖర్చు, వైసిపి ఇవ్వకుండానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్న పదకాల పత్రికల మీడియా ప్రకటనల ఖర్చు ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నుండి ప్రభుత్వ ఖజానా నుండి కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని పెందుర్తి శ్రీనివాస్ ఆరోపించారు.
Prajavartha Online Telugu News