-దాతల సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాదించాలి
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో పాటు దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించడం ద్వారా లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గవర్నర్ పేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో నిర్వహించిన వెనుకబడిన ప్రతిభావంతులైన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ లు పంపిణి చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు తోడు దాతల సహకారం ఎంతో అవసరం అన్నారు. పేద బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలలో ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారన్నారు. వారికీ మరింత సహకారం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారన్నారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ సి ఎన్ ఆర్ రావు మైఖేల్ ఫెర్డ్ హాన్స్ బేతే వంటి అనేకమంది ప్రముఖులు దాతల ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోని రాణించాలన్నారు. విద్యపై ఆసక్తిని పెంచుకొని జీవితంలో ఏదైనా సాధించాలనే దృక్పధం కల్పించుకుంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించకగలుగుతారన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్దే ప్రధాన ఆశయంగా సేవలందిస్తన్నా రాయల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం నాడు నేడు పధకం ద్వారా పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతులను కల్పిస్తుంది అన్నారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు జగనన్న విద్య కానుక , అమ్మఒడి , విద్యాదివేన వంటి అనేక పధకాలను అమలుచేస్తోందన్నారు . దాతల సహకారంతో విద్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచి ఫలితాలలో జిల్లాను అగ్ర నిలుపుదామన్నారు . రాయల్ ట్రస్ట్ చైర్మన్ పి.పుల్లయ్య మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ట్రస్ట్ కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీపరీక్షలకు హాజరైయేందుకు శిక్షణ పొందేలా వసతితో కూడిన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు . విద్యార్థుల భహుళ ప్రయోజనాలు వసతి కొరకు విజయవాడ సమీపంలో భహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు . ఈ ఏడాది 20 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు అందించనున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 87 మంది విద్యార్థులకు 7 .52 లక్షల రూపాయలు ఉపకార వేతనంగా అందిస్తున్నామన్నారు. వీటితో పాటు కండరాల బలహీనత వ్యాధి గ్రస్తులకు లక్ష డెభై వేల రూపాయలతో పవర్ ఆపరేటేడ్ వీల్ చైర్స్ అందించామన్నారు. వివిధ వ్యాధులతో భాదపడుతున్న వారికీ వైద్య సహాయం కొరకు ఆర్థిక సహాయం అందింస్తున్నామని ఆయన తెలిపారు. స్కాలర్షిప్ ల పంపిణి కార్యక్రమంలో బొండాడ గ్రూప్స్ సంస్థ చైర్మన్ బి. రాఘవేంద్రరావు వెస్టిన్ కాలేజీ డైరెక్టర్ కె . దుర్గ ప్రసాద్ రాయల్ సర్వీసెస్ ట్రస్ట్ కార్యదర్శి గుండపు చంద్రశేఖర్ జి .రామారావు రాయల్ క్లబ్ జాతీయ అధ్యక్షులు సుంకర కృష్ణ ఫౌండర్ మిరియాల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి శివరామ కృష్ణ, రవిశెట్టి కొండలరావు, ట్రస్ట్ సభ్యులు , విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News