-తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం
-పాల్గొన్న అనపర్తి శాసన సభ్యులు, జాయింట్ కలెక్టర్
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం సేకరణ కోసం కొన్ని మార్పులు తీసుకుని వొచ్చి రైతులకు పూర్తి స్థాయి లో భరోసాను కల్పించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం రాష్ట్రంలోనే ఈ ఖరీఫ్ సీజన్లో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనపర్తి లోని రైతు భరోసా కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణ కొనుగోలు లో కొన్ని మార్పులు ఈ సీజన్ లో కొత్తగా చేర్చి రైతుల నుంచి సేకరణ చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో ప్యాడి దిగుబడి ఆధారంగా ఎఫ్ టి వో జనరేట్ చేసి, వి ఏ ఓ ల ద్వారా గన్ని బ్యాగ్స్ అందచేసి, పి ఎ సి కేంద్రాలు ద్వారా కొనుగోలు చేశారని గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కళ్లా లోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కు అడుగులు వేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అర్భికే పరిధిలో పంట కోసి సిద్దంగా ఉన్న రైతు వి ఏ వో/వి హెచ్ వో వద్ద కు వచ్చి వివరాలు తెలిపితే పొలం వద్దకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ను పంపి, ధాన్యం లో తేమ శాతం, రాళ్ళు, వ్యర్ధాలు, చెడిపోయిన రంగు మారిన, పరిపక్వం లేని వాటి విషయంలో రైతులకు సలహాలు సూచనలు చేస్తామన్నరు. తేమ 17 శాతం 17, వ్యర్థాలు ఒక శాతం, చెడిపోయిన, రంగు మారినవి 5 శాతం, పరిపక్వం ముడుచుకు పోయినవి 3 శాతం వరకు ఉన్నవి కొనుగోలు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఆయా విషయాలు పై రైతులకు అవగాహన కోసం సమాచారం ఇవ్వడం, ఏ రోజున అర్భీకే ద్వారా కొనుగోలు చేస్తామో సమాచారం ఇచ్చి మరీ కొనుగోలు చేస్తామన్నారు. జట్టు కూలీలు నుంచి ప్రతి దశలో రైతులకు సహకారం అందించి, మధ్యవర్తుల ప్రశ్నే ఉత్పన్నం కాకుండా చేసే భాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏ రైతు పండించిన ధాన్యం ఏ మిల్లుకు వెళుతుంది అన్న విషయమై పూర్తి గోప్యత పాటించడం ఇందులో మరో ప్రధానమైన అంశం గా ఆయన తెలిపారు.
నూరుశాతం ఈ క్రాప్ & ఈ కేవైసి జిల్లాలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జిల్లాలోని 239 అర్భికే లకు 143 మిల్లులు మ్యాపింగ్ చేశామని జేసీ శ్రీధర్ తెలిపారు. పూర్తి స్థాయి మొబైల్ బేస్డ్ ప్రాక్యూర్ మెంట్, మూడు దశల్లో ఫోటో లు అప్లోడ్, సాంకేతిక సహకారం, ఎక్కడా అవినీతి, మాధ్యవర్తిత్వం లేకుండా నగదు ప్రోత్సాహం తదితర అంశాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు.
శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రైతులు పండించే పంట కు మద్దతు ధర ivvadamt, ఉచితంగా పంట బీమా పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. అనపర్తి మండలం పరిధిలో మూడు రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ఈ ఖరీఫ్ లో 3300 మంది రైతుల నుంచి సుమారు 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం, అందుకు అనుగుణంగా సిబ్బందిని సమాయత్తం చేశామన్నారు. రాష్ట్రంలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం అనపర్తి నియోజకవర్గం లో ప్రారంభించి నట్లు ఆయన తెలిపారు. రైతుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ఆయన తెలిపారు
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, డి ఎమ్ పౌర సరఫరాలు ఆర్. తనూజా, డి ఎస్ వో పి. ప్రసాద్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News