ఇంధ్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆదివారం రాష్ట్ర డి.జి.పి కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి, IPS దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర డి.జి.పి శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు అందజేశారు.
Prajavartha Online Telugu News